గజల్ శ్రీనివాస్ రిమాండ్ కు తరలింపు


లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 12 వరకు రిమాండ్‌ విధించింది. ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు గజల్‌ శ్రీనివాస్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేస్తామని ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో పంజాగుట్ట ఠాణాలో ఏసీపీ విజయ్‌కుమార్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత మహిళ సమర్పించిన వీడియో దృశ్యాలు, అన్ని ఆధారాలను పరిశీలించాకే శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఆయన రెండు నెలలుగా బాధితురాలిని వేధిస్తున్నాడని, అందుకు సంబంధించి ఆధారాలను కూడా ఆమె సమర్పించిందని తెలిపారు. శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరించిందంటూ ఆయన మహిళా అటెండర్‌పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీపీ చెప్పారు.

ముఖ్యాంశాలు