షిరిడీ నాథుని సన్నిధిలో నాగార్జున


అఖిల్‌ అక్కినేని చిత్రం ‘హలో’ ప్రీరిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం నాగార్జున షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా సన్నిధిలో ఉన్న తన ఫోటోను నాగ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముందు బాబా ఆశీర్వాదం తీసుకోవడానికి స్నేహితుడు మహేశ్‌తో కలిసి షిర్డీకి వచ్చానని పేర్కొన్నారు. థ్యాంక్యూ బాబా అనినాగ్‌ పేర్కొన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ‘హలో’ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మించారు. సెన్సార్‌ పనులు పూర్తయిన ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అఖిల్‌కి జోడీగా కల్యాణి ప్రియదర్శన్‌ నటించగా అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ముఖ్యాంశాలు