భారీగా ఎగిసిన బంగారం ఢమాల్‌


Gold rate

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో శుక్రవారం మార్కెట్‌లో భారీగా ఎగిసిన బంగారం ధరలు, ఒక్కరోజులోనే క్షీణి౦చాయి. స్థానిక జువెలర్ల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో పాటు, బలహీనమైన గ్లోబల్‌ సంకేతాలతో శనివారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.820 కిందకి పడిపోయి రూ.30,530గా నమోదైంది. ఈ ఏడాదిలో అ‍త్యధికంగా పడిపోవడం ఇదే తొలిసారి. నిన్నటి బులియన్‌ మార్కెట్‌లో ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర 990 రూపాయల మేర పెరిగి రూ.31,350గా నమోదైన సంగతి తెలిసిందే.

ముఖ్యాంశాలు