అన్నిటికి “ఆధార్” ఆధారం....


Aadhaar Logo

నాలుగు అంశాలకు సంబంధించి ఆధార్‌ లింక్‌ చేసుకోవడానికి వేర్వేరు గడువు తేదీలను ప్రకటించారు.

  1. పాన్ కార్డులను 2017 డిసెంబర్‌ 31 తేదీ లోపు పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌ నెంబర్‌ను పాన్‌కు అనుసంధానం చేయడం తప్పనిసరి అని ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు సూచించింది. 2017-18 సంవత్సరానికిగాను సంబంధించిన దాఖలైన ఇన్‌కంటాక్స్‌ రిటర్నులను వెరిఫై చేయడానికి ఆధార్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. పాన్‌కు ఆధార్‌లింకు చేయకపోతే రిటర్నును చెల్లనిదిగా పరిగణిస్తారు. మళ్లీ రిటర్నులను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఆలస్యంగా వచ్చిన రిటర్నుగా పరిగణించి అపరాధ రుసుము, వడ్డీ కూడా విధిస్తారు.

  2. మొబైల్‌ ఫోన్‌కు ఆధార్‌ను లింక్‌ చేసుకోడానికి 2018, ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఉంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఖాతాదారులకు సందేశాలు పంపుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ కౌంటర్లలో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే అన్ని మొబైల్ ఆపరేటర్సు తమ ఖాతాదారులకు సందేశాలను పంపిస్తున్నారు.

  3. బ్యాంకులు మరియు అన్ని ఆర్ధిక సంస్థల లో లావాదేవీలకు 2017 డిసెంబర్‌ 31 లోపు ఆధార్‌ను లింక్‌ చేయడం తప్పనిసరి. దీనికి కూడా ఆయా సంస్థలు నో యువర్‌ కస్టమర్‌ (కేవైపీ) ద్వారా ఆధార్‌ వివరాలను తెలుసుకునే వీలుంది. కేవైసీలో క్లైంట్‌కు సంబంధించిన అధికార పూర్వక వివరాలు తెలుస్తాయి.

  4. సాంఘిక భద్రత స్కీమ్‌ల లబ్ధిదారులుకూడా 2017 డిసెంబర్‌ 31 లోపు ఆధార్‌ను లింక్‌ చేయడం తప్పనిసరి. పింఛన్‌, ఎల్‌పీజీ, ప్రభుత్వ ఉపకారవేతనాలు పొందే లబ్ధిదారులంతా తప్పనిసరిగా ఆధార్‌ లింక్‌ నమోదు చేయాలి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం