ఉండవల్లితో బహిరంగ చర్చకు వస్తానంటున్న ఎన్ఆర్ఐ


undavalli, chekuri

అందరినీ ఉండవల్లి బహిరంగచర్చకు పిలవడం పరిపాటి.... ఆయన తో చర్చ అంటే పలువురు భయపడతారు కూడా... అయితే ఇక్కడ రొటీన్ కి భిన్నంగా ఆయననే చర్చకి పిలుస్తున్నారొక ప్రవాసాంధ్రుడు. పోలవరం ప్రాజెక్ట్ పై ఎడతెగని దుష్ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో బహిరంగ చర్చకి సిద్ధమని తెలుగుదేశాన్ని అభిమానించే డల్లాస్ వాసి కెసి చేకూరి స్పష్టం చేసారు. సోషల్ మీడియా (పేస్ బుక్) ద్వారా ఆయన ఉండవల్లికి ఈ సవాల్ విసిరారు. తన ఫ్లయిట్ టికెట్ ఖర్చులు కూడా తానే భరించి ఇండియా వస్తానని, సాక్షితో సహా ఏ ఛానెల్ అయినా సరే, ప్రకాశం బరాజ్, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు సైట్లు, అమరావతి ప్రెస్ క్లబ్...ఎక్కడైనా సరే..ఒక ముఖాముఖి చర్చ పెట్టుకుందామని ఆయన ప్రతిపాదించారు. "పోలవరం ప్రాజెక్టు పూర్తవకపోయినా 2018లో గ్రావిటీతో నీళ్ళు ఇచ్చేస్తాడండీ చంద్రబాబు" అని ఉండవల్లి వ్యాఖ్యానించడం అవగాహనా రాహిత్యమని చేకూరి మండిపడుతున్నారు. కాఫర్ డ్యామ్ అయినా, ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ అయినా పోలవరం ప్రాజెక్టునుండి గ్రావిటీతోనే నీళ్లు వస్తాయని స్పష్టం చేసారు. ఇంజనీర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు... ఇలా అందరి మాటలు తామే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. 2018, 2019, 2029, 2100 .. ఇలా ఎప్పుడైనా కూడా పోలవరం నీళ్ళు గ్రావిటీతోనే వస్తాయన్నారు. 2018లో కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు స్టోర్ చేసి పోలవరం రైట్ కెనాల్లోకి పంపాలంటే -స్పిల్‌వే, స్పిల్‌ఛానెల్ పనులు పూర్తవ్వాలని పేర్కొన్నారు. రేడియల్ గేట్లన్నీ అమర్చాలని, ఇవన్నీ అయిపోయాక ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్ కట్టడానికి నాలుగు నెలలు మాత్రం సరిపోతుందని చెప్పారు. అంత పనీ అయిపోయాకా మట్టి ఆనకట్టని కట్టకుండా చంద్రబాబు ఎందుకు మానేస్తారని ప్రశ్నిస్తూ.. ఛానల్స్ కివచ్చి మాట్లాడే ముందు కనీస పరిజ్ఞానంతో రావాలని ఉండవల్లి కి సూచించారు.

ముఖ్యాంశాలు