దసరా స్పెషల్ రైళ్లు


Special Trains

దసరా పండగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. హైదరాబాద్‌-విశాఖ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. ఈ నెల 28, 30 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌లో ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు విశాఖకు చేరుతుంది. అలాగే ఈ నెల 29, అక్టోబర్‌ 1 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు విశాఖలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి కాకినాడ పోర్టుకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాకినాడకు వెళ్లే ఈ రైలు ఈ నెల 27, 29 తేదీల్లో సాయంత్రం 6.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.35 గంటలకు చేరుకోనుంది. కాకినాడలో ఈ నెల 28, అక్టోబర్‌ 2 తేదీల్లో సాయంత్రం 5.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు అక్టోబర్‌ 1న మరో రైలు ఏర్పాటుచేశారు. ఈ రైలు రాత్రి 11.40 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు కాకినాడకు చేరుకోనుంది.

ముఖ్యాంశాలు