పనితీరుకు ర్యాంకులు - సీఎం చంద్రబాబు


CM Review, Chandra Babu

మంత్రిమండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన సి‌ఎం, వైద్య ఆరోగ్యశాఖ, అటవీశాఖల అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా శాఖల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోందని అసహనంవ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. శాఖల వారీగా పురోగతిపై ఎప్పుటికప్పుడు మంత్రులతో సమీక్షిస్తానని, కలెక్టర్ల మధ్య పోటీ పెడతామని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన వారికి ఏపీఐఐసీ హైదరాబాద్‌లో కూడా లేని విధంగా భూముల ధరలు చెబుతోందని, అలా అయితే ఎవరైనా ఎందుకు ముందుకు వస్తారన్నారు. మంత్రులు, అధికారులు స్వయంగా రీచ్‌లకు వెళ్లి పరిస్థితి సమీక్షించాలని చెప్పారు. ఇసుక ధరల్ని 10-15 రోజుల్లో పూర్తిగా నియంత్రణలోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు చేయలేకపోతే తానే స్వయంగా రేవులో కూర్చుని ధరలు నియంత్రిస్తానని ఆయన పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించాలని ఆదేశించారు. నెలాఖరులోగా కలెక్టర్ల సదస్సు జరగాలని, షెడ్యూల్‌ తప్పడానికి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం