ప్రారంభోత్సవానికి ముందే కూలిన ప్రాజెక్ట్ గోడ

 బీహార్ లో రూ.389.31 కోట్లతో చేపట్టిన గతేశ్వర్‌ పంథ్‌ కెనాల్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 24 గంటల ముందే ఒక గోడ కూలిపోయింది. కెనాల్‌లోకి భారీగా నీరు చేరడంతో అక్కడ నిర్మించిన గోడ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టును బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ బుధవారం ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రమాదం కారణంగా ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కెనాల్‌ గోడ కూలిపోవడంతో నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది.

Facebook
Twitter