ప్రధాని ఫోటో లేదని సోము వీర్రాజు ఆగ్రహం


స్వచ్ఛభారత్‌తో సంపూర్ణ ఆరోగ్యభారత్‌ సాధ్యమని ఎమ్మెల్సీ సోమువీర్రాజు అన్నారు, ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు స్వచ్ఛభారత్‌ పక్షోత్సవాలను ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆదివారం ప్రారంభించారు. స్థానిక తాడితోట చందన నాగేశ్వరావు మెమోరియల్‌ మున్సిపల్‌ పాఠశాలలో భాజపా నగర అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. చీపుర్లు చేతబట్టి వారంతా పాఠశాలను శుభ్రం చేశారు. వీర్రాజు మాట్లాడుతూ స్వచ్ఛ పక్షోత్సవాలు అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాని పిలుపుమేరకు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్‌ ప్రచార కార్యక్రమంలో ప్రధాని చిత్రం లేకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. దేశ అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేస్తున్న మోదీ ఆశయాలను సాకారం చేసేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. భాజపా నాయకులు గరిమెళ్ల చిట్టిబాబు, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణారావు, బూరా రామచంద్రరావు, నిల్లా ప్రసాదరావు, రొయ్యి వెంకటేశ్వరరావు, కొత్తపల్లి గీతావిజయలక్ష్మి, పి.వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం