వర్మ సినిమా.. షాక్ లో నందమూరిసంచలన చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హఠాత్తుగా రూటు మార్చి అటు నందమూరి కుటుంబానికి, ఇటు నారా కుటుంబానికీ కూడా పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానని వర్మ ఏనాడో ప్రకటించారు. అయితే రామారావు తనయుడు బాలకృష్ణ కూడా బయోపిక్ కి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే బాలకృష్ణ తీసే సినిమాలో చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్, లక్ష్మీపార్వతి తో ద్వితీయ వివాహం ఎపిసోడ్ ఉండవనే విషయం జగద్విదితం. ఈ నేపథ్యంలోనే వర్మ ఇప్పుడు తన సినిమాని లక్ష్మీపార్వతి కోణంలోనుంచి తీస్తానని చెబుతున్నారు. ఇందుకోసం రాయించి రికార్డ్ చేసిన ఒక పాటని కూడా ఆయన విడుదల చేసారు.. జై ఎన్టీఆర్ .. జై ఎన్టీఆర్ అంటూ సాగే ఈ పాటని వర్మ పాడారు. లక్ష్మీపార్వతితో పెళ్ళికి దారి తీసిన సందర్భాలు, ఆ సందర్భంలో కుటుంబ సభ్యుల వైఖరి, రాజకీయంగా పడదోసేందుకు చంద్రబాబు సహా యావత్ కుటుంబ సభ్యుల డ్రామా, రామారావుకి జరిగిన అవమానాలు, ఆయన మరణం.. ఇలా అన్ని విషయాలనూ ఈ చిత్రంలో చెబుతానని వర్మ అంటుండడం వియ్యంకులు బాలయ్య, చంద్రబాబు ఇద్దరికీ ఇబ్బందికరమైన విషయమే. అయితే వర్మ తాజా నిర్ణయం లక్ష్మీపార్వతికి మాత్రం ఆనందం కలిగిస్తుందనేది విదితమే.