వర్షానికి ముంబై గజగజ


Mumbai Rains

ముంబయిలో మంగళవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. ఇంకో 72 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం 12 గంటల వ్యవధిలో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.15 మధ్య నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాన రన్‌వేను మూసివేశారు. ఇక్కడ రెండో రన్‌వే మాత్రమే పనిచేస్తోంది. ఒక విమానం ప్రధాన రన్‌వే పై అదుపుతప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 50 విమాన సర్వీసులను రద్దు చేశారు. స్పైస్‌ జెట్‌, ఇండిగో సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం