శ్రీశైలం జలాశయంలోకి జల ప్రవాహం


Srisailam Dam

శ్రీశైలం జలాశయంలోకి లక్షా 44వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. శనివారం ఉదయం ఆరు గంటలకు 41వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, మధ్యాహ్నం మూడు గంటలకు లక్షా 44వేల క్యూసెక్కులకు చేరింది. నారాయణపూర్‌, ఉజ్జియినితోపాటు సుంకేశుల నుంచి ప్రవాహం రావడంతో శనివారం మధ్యాహ్నానికి పెరిగింది. ఆదివారమూ కొనసాగే అవకాశం ఉంది. తాజా ప్రవాహంతో శ్రీశైలం నీటిమట్టం 838.20 అడుగులకు పెరిగింది. ఈ సీజన్‌లో 43 టీఎంసీలు వచ్చింది. ఆలమట్టిలోకి శనివారం ఉదయం 45వేల క్యూసెక్కులు రాగా మొత్తం బయటకు వదిలారు. ప్రవాహం తగ్గకపోయినా బయటకు వదిలే నీరు సాయంత్రానికి 30వేల క్యూసెక్కులకు తగ్గించారు. నారాయణపూర్‌ నుంచి వచ్చే ప్రవాహాన్ని 55వేల క్యూసెక్కుల నుంచి ఆరువేలకు తగ్గించారు. ఉజ్జయిని నుంచి ఉదయం 60వేల క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రానికి ఐదువేల క్యూసెక్కులకు తగ్గించారు. ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొని నీటి విడుదలలో మార్పులు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు