సిమ్‌ కార్డుకు ఆధార్‌లింక్‌?


Sim Cards

2018 నుంచి డీయాక్టివేట్‌ చేయనున్నట్లు సమాచారం. లోక్‌నీతి ఫౌండేషన్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మొబైల్‌ నంబర్లకు ఆధార్‌ను అనుసంధానించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని మొబైల్‌ సిమ్‌ కార్డులకు ఆధార్‌ అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని టెలికం కంపెనీలే వినియోగదారులకు తెలియజేయాలని కేంద్రం సూచించింది.

తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్‌కార్డులు తీసుకొని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. సిమ్‌ కార్డు విక్రయ సమయంలో వినియోగదారుడి బయోమెట్రిక్‌ తీసుకొని దాన్ని ఆధార్‌తో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది.

ముఖ్యాంశాలు