రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ముంబై: నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బాంద్రా రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బెహ్రంపదాలో చెలరేగిన మంటలు బాంద్రా రైల్వే స్టేషన్ వరకు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జికి మంటలు అందుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మొత్తం 16 ఫైర్ ఇంజిన్లు, 12 వాటర్ ట్యాంకులు ఉపయోగించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ముఖ్యాంశాలు