అసెంబ్లీకి ఎందుకు రానంటే...!!
ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని అందురు తాను అసెంబ్లీకి గైర్హాజరు కావడం ద్వారా నిఓరసన వ్యక్తం చేయదలచుకున్నానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టం చేసారు. ఈమేరకు ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసారు. జగన్ లేఖను పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ప్రతిపక్షం నైతిక స్థైర్యం దెబ్బ తీసేందుకు చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తక్షణం జోక్యం చేసుకుని దీనిని ఆపాలని ఈ లేఖలో జగన్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు మాఫియా పాలనను సాగిస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాక అసెంబ్లీ వెబ్సైట్లో వారిని ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులుగానే చూపడం జరుగుతున్నదని తెలిపారు. నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా కొనసాగించడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేంతవరకూ శాసనసభకూ, శాసనమండలికీ హాజరు కారాదని ఈ నెల 26వ తేదీన జరిగిన వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు.