తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. రైల్వే లోకోమోటివ్స్ తయారీలో ఖ్యాతి గడించిన మేధా సర్వో డ్రైవ్స్ రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లాలోని కొండకల్ గ్రామంలో ఈ పరిశ్రమను స్థాపించనుంది. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో మేధా సర్వో డ్రైవ్స్ సంస్థ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌లో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రైల్వే లోకోమోటివ్స్ తయారీలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న మేధా సర్వో డ్రైవ్స్ తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు.