EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

దుబాయ్ లో రజని 2.0 సందడి .. అదిరిన ఆడియో వేడుక

 

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘2.ఓ’. ఈ చిత్రంలో అమీజాక్సన్‌ కథానాయిక. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహించారు. లైకాప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరకర్త. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో 2.ఓ’.పాటల విడుదల వేడుక అట్టహాసంగా జరిగింది. భారీ హంగుల మధ్య జరిగిన ఈ వేడుకకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా సంగీత ప్రదర్శనతో పాటు, బాస్కో బృందం నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘2.ఓ’ పాటల విడుదల సందర్భంగా దుబాయ్‌ నగరంలో ఎక్కడ చూసినా ఆ సినిమా పోస్టర్లే దర్శనమిచ్చాయి. స్కై డైవ్‌ చేస్తూ పోస్టర్‌ని ప్రదర్శించడం ఆకట్టుకుంది.  రానా, బాలీవుడ్‌ ప్రముఖుడు కరణ్‌జోహార్‌, తమిళ నటుడు ఆర్‌.జె.బాలాజీ వేడుకని హోస్ట్‌ చేశారు. రజనీకాంత్‌ కుటుంబసభ్యులు, సూర్య, జ్యోతిక, కార్తి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

Facebook
Twitter