బస్సు బీభత్సానికి ముగ్గురు బలివిజయవాడ: విజయవాడ లో శుక్రవారం ఆర్టీసీ సిటీ బస్సు సృష్టించిన బీభత్సం ముగ్గుర్ని బలి తీసుకుంది. అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెన సమీపంలో ఉన్న బుడమేరు వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. గవర్నరుపేట-2 డిపో ఆర్టీసీ బస్సు గన్నవరం నుంచి విజయవాడకు వస్తోంది. ఉదయం 6.45 సమయానికి అజిత్‌సింగ్‌నగర్‌ పైవంతెన మీదుగా కిందకి దిగుతున్నప్పుడు బ్రేకులు ఫెయిలయ్యాయి. హ్యాండ్ బ్రే వేసే అవకాశం ఉన్న ఆందోళనలో విస్మరించిన డ్రైవర్ అదుపు చేసేందుకు ఏం చేయాలో అర్థంకాని అయోమయంలో అటూఇటూ తిప్పుతూ బస్సును బుడమేరు కాలువ వంతెన పైకి తెచ్చాడు. ఆ సమయంలో కొన్ని ద్విచక్రవాహనాలు, ఆటో వెళుతున్నాయి. వాటిని ఢీకొడుతూ బస్సు ముందుకు దూసుకుపోయింది. వాహనాలపై నుంచి జనం గాలిలోకి ఎగిరి బస్సు ముందు పడిపోగా వారిని బస్సు తొక్కేసుకుంటూ వెళ్లింది. ముందు వెళుతున్న లారీని వెనుకనుంచి ఢీకొని ఈ బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మైలవరం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు షేక్‌ హుర్షీద్‌(30), అర్షా(10) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. నున్న ప్రాంతానికి చెందిన వీరచందర్‌(30) ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మైలవరానికి చెందిన అబ్దుల్‌ గఫూర్‌, షేక్‌ కరీముల్లా, షాకీరా, షేక్‌ మీరా, దిల్‌షాద్‌ బేగం, సుబానీ, విజయవాడకు చెందిన నిహారిక(22) గాయపడ్డారు. నాలుగు ద్విచక్రవాహనాలు, ఒక ఆటో ధ్వంసమయ్యాయి.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం