స్వాతంత్య్రం ప్రకటించుకున్న కాటలోనియా

స్పెయిన్‌లో పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన కాటలోనియా ప్రాంతం తనకు తాను స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. స్పెయిన్‌ ప్రభుత్వం ఈ ప్రాంతంపై ప్రత్యక్ష పాలనకు సిద్ధమవుతుండగా కాటలోనియా గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ ప్రాంతీయ పార్లమెంటులో శుక్రవారం తీర్మానం చేసింది. 135 మంది సభ్యులున్న ఈ పార్లమెంటులో తీర్మానానికి అనుకూలంగా 70 మంది.. వ్యతిరేకంగా 10 మంది ఓటు వేశారు. ప్రతిపక్షాలకు చెందిన మిగతా సభ్యులు తీర్మానాన్ని నిరసిస్తూ వాకౌట్‌ చేశారు. ఈ తీర్మానాన్ని అమలు చేసే రాజకీయ అధికారం కాటలోనియాకు లేదు. ఈ స్వీయ స్వాతంత్య్ర ప్రకటనను స్పెయిన్‌, అంతర్జాతీయ సమాజం అధికారికంగా గుర్తించే అవకాశం కూడా లేదు.

ముఖ్యాంశాలు