అణు యుద్ధం ముంగిట ప్రపంచం


అత్యంత ప్రమాదకర అణు ఆయుధాలను అమెరికా బయటకు తీస్తోంది. బీ-52 న్యూక్లియర్‌ బాంబర్లను యుద్ధప్రాతిపదికన అప్‌గ్రేడ్‌ చేస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఉత్తర డకోటాలోని మినాట్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ను సందర్శించడం ఈ సన్నాహాల్లో భాగమే. ఈ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో మొత్తం 26 బి-52 బాంబర్లు, 150 ఖండాంతర క్షిపణులను అమెరికా భద్రపర్చింది. ఇటీవల అమెరికా వాయుసేన అధిపతి డేవిడ్‌ గోల్డ్‌ఫెన్‌ లూసియానాలోని బెర్స్‌డేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ను సందర్శించారు. ఇక్కడ ఎయిర్‌ఫోర్స్‌ గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ ఉంది. దీంతోపాటు అమెరికా రెండో బాంబింగ్‌ విభాగానికి ఇది ప్రధాన కార్యాలయం. ఈ పర్యటన సందర్భంగా గోల్డ్‌ఫెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్డ్‌వార్‌ నాటి న్యూక్లియర్‌ ఆయుధాలు కలిగి ఉన్న బి-52 బాంబర్లను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధినేత ట్రంప్ ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాకు కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తమ సర్వసేనాధిపతి అయిన ట్రంప్‌కు రక్షణగా అమెరికా బలగాలు ఏ స్థాయిలో రంగంలోకి దిగుతాయో బి-52 బాంబర్ల ను సిద్ధం చేయడం ఒక సూచిక మాత్రమే.

ముఖ్యాంశాలు