ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సోనియా


Sonia Gandhi

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ శనివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని గంగా రామ్‌ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. 70 ఏళ్ల సోనియాకు కడుపు నొప్పి రాగా, ఆస‍్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సిమ్లా నుంచి ఆమెను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని సర్‌ గంగా రామ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్‌ గాంధీ కూడా సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. ఆమెను కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం.

ముఖ్యాంశాలు