పాటకు సెలవిక.. రిటైర్మెంట్ ప్రకటించిన ఎస్ జానకమ్మ


S. Janaki, Singer

ప్రఖ్యాత గాయని ఎస్‌.జానకి గాయనిగా తన ప్రస్థానానికి ముగింపు పలికారు. పలు చిత్రాలకు నేపథ్యగానాన్ని అందించిన జానకి వయోభారం కారణంగా గత కొంతకాలంగా వేదికలపై పాటల్ని పాడటాన్ని నిలిపివేసిన విషయం విదితమే. ఒక సంస్థకు విరాళాలను సమకూర్చేందుకు ఆమె మైసూరులో శనివారం రాత్రి తన చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. విశేషం ఏమిటంటే 1952లో ఇక్కడి నుంచే ఆమె తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. తనకు సంగీత జన్మనిచ్చిన మైసూరులోనే చివరి పాత పాడడం ద్వారా ఈ పట్టణంపై మమకారాన్ని, కృతజ్ఞతను చాటుకున్నానాని చెప్పారు. ఆమెకు అభిమానులు ప్రవీణ్‌, పవన్‌, నవీన్‌ల విన్నపం మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు ఈ వేదికపై చివరి సంగీత విభావరిని ఆమె అందించారు. వేలాదిమంది సంగీతాభిమానులు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆమె పాటలను విని పులకించారు. రాజవంశస్తురాలు ప్రమోదా దేవి ఒడయరు, మాజీ మంత్రి జి.టి.దేవెగౌడ, అలనాటి నాయికలు జయంతి, భారతీ విష్ణువర్ధన్‌ తదితరులు ఎస్ జానకిని ఘనంగా సత్కరించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం