జక్కంపూడి రాజాకు ముద్రగడ ప్రభృతుల పరామర్శ


రాజమండ్రి బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజా ను కాపు నేతలు ముద్రగడ పద్మనాభం , ఆకుల రామకృష్ణ , తుమ్మల రమేష్ , కలవకొలను తాతాజీ, నల్లా విష్ణు , నల్లా పవన్ తదితరులు పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్‌ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా ముద్రగడ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేసారు. రామచంద్రాపురంలో కారు పార్కింగ్ విషయమై తలెత్తిన వివాదంలో ఎస్సై నాగరాజు రాజాపై దౌర్జన్యం చేసి గాయపరిచిన విషయం విదితమే.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం