పుప్పాల బాపిరాజుకు ఇండియన్ ఐకాన్ పురస్కారం


రాజమహేంద్రవరంలోని బిజిఆర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల లో డ్రాయింగ్ ఉపాధ్యాయుని గా పనిచేస్తున్న పుప్పాల బాపురాజు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ఇండియన్ ఐకాన్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. 50 మంది లో ఒకనిగా ఎంపికై ఆయన ఈ గౌరవాన్ని పొందారు.ఈ మేరకు వరల్డ్ ఆర్ట్స్ డే ఛాంపియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆయనకు ధ్రువీకరణ పత్రాన్ని పంపారు. ప్రముఖ మానసిక వైద్యులు,డాక్టర్ కర్రి రామా రెడ్డి ఈ సందర్భంగా బాపిరాజుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి వరుస రికార్డులు సాధిస్తూ నగరానికి ఖ్యాతి తెస్తున్నారని అభినందించారు. జిల్లా విద్యా శాఖాధికారి ఎస్.అబ్రహం, అర్బన్ రేంజ్ డి ఐ బి.దిలీప్ కుమార్, కరెస్పాండెంట్ రెబక్కమ్మ, ప్రధానోపాధ్యాయిని టి.నళినీ రత్న కుమారి, ఏ.పి టి జి.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బి.చిట్టిబాబు, కార్యదర్శి పరస జగన్నాథరావు తదితరులు బాపిరాజు ని అభినందించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం