ప్రముఖ క్రికెటర్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ కన్నుమూత

ప్రముఖ క్రికెటర్‌ డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ (51) కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో సోమవారం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. మధ్యాహ్నం భోజనం చేయడానికి సిద్ధం అవుతుండగా తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చినట్టు తెలిసింది. హైదరాబాద్‌ నుంచి రంజీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన శ్రీధర్‌ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి, బీసీసీఐలో జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం