రావిపాటి రామకృష్ణకు ఉత్తమ నర్సరీ రైతు అవార్డు

కడియం మండలం కడియపులంక లోని శ్రీవిజయ దుర్గ నర్సరీ వైస్‌ ఛైర్మన్‌ రావిపాటి రామకృష్ణ ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నర్సరీ రైతు అవార్డును అందుకొన్నారు. ఇటీవల దిల్లీలోని ఐఐటీ ప్రధాన ఆడిటోరియంలో జరిగిన ఐఎన్‌ఏ (అఖిల భారత నర్సరీ రైతుల సంఘం)-2017 సర్వ సభ్య సమావేశంలో ఈ సంవత్సరపు ‘బిగ్‌ నర్సరీమెన్‌’ పురస్కారాన్ని అందుకొన్నారు. దిల్లీ పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అయిన ఇమ్రాన్‌హుస్సేన్‌ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌ఏ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి పుల్లా వీర వెంకట్రావు, కోశాధికారి తాడాల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం