సమస్యలపై మేయర్ కు ఉపాధ్యాయుల మొర


దీర్ఘ కాలం గా పెండింగ్ లో ఉన్న నగరపాలక సంస్థ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ( యూ టి ఎఫ్ ) రాజమహేంద్రవరం శాఖ ప్రతినిధులు మేయర్ పంతం రజనీ శేష సాయికి వినతిపత్రం సమర్పించారు. మేయర్ కు యు టి ఎఫ్ నగర శాఖ అధ్యక్షులు బి ఆంజనేయులు అధ్యక్షతన ప్రతినిధులు తమ సమస్యలు విన్నవించారు . గత ఆగస్టు నెల లో జరిగిన అగ్ని ప్రమాదం లో కాలిపోయిన ఉపాధ్యాయుల సేవా పుస్తకాల బదులుగా డూప్లికేట్ సర్వీసు రిజిస్టర్ (ఎస్ ఆర్) లను ప్రారంభించాలని చాలా సార్లు కోరామని, అయితే అది ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదని వాపోయారు. ఇదే కాకా ఇంకా చాల సమస్యలపై ఇటువంటి సాచివేత ధోరణిని నిరసిస్తూ ఈ నెల 31 వ తేదీన నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ధర్నా చేయాలనీ నిర్ణయించామని చెప్పారు. ఈ నోటీసు ను లిఖిత పూర్వకం గా కార్యాలయం లో అందచేసామని చెప్పారు. మేయర్ ఈ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని , సోమవారం నాటికీ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమం లో యూ టి ఎఫ్ నగర శాఖ అధ్యక్షులు బి. ఆంజనేయులు , ప్రధాన కార్యదర్శి అలీం బేగ్ , మల్లిపూడి శివాజీ , ఎన్ .నాగేశ్వర రావు,దాసరి శివ సత్యమూర్తి ,కె. మునీశ్వర రావు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యాంశాలు