అణు ప్రయోగ స్థలంలో కూలిన సొరంగం .. 200 మంది మృతి


ఉత్తరకొరియాలోని ఒక అణుప్రయోగ స్థలంలోని భారీ సొరంగం కుప్పకూలి 200 మంది మరణించారు. జపాన్‌ మీడియా లో ఈ వార్త వెలుగు చూసింది. అక్టోబర్‌ 10న ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మొదట ఈ త సొరంగంలో 100 మంది చిక్కుకున్నారని వారికి సహకరించేందుకు వెళ్లిన బృందాలపై కూడా సొరంగం కుప్పకూలి మొత్తం రెండు వందల మంది చనిపోయారు. కాగా దీనిపై ఉత్తర కొరియా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ఇక్కడ హైడ్రోజన్‌ బాంబ్‌ను పరీక్షించడంతో ఆ ప్రదేశం దారుణంగా దెబ్బతిని గుల్లబారిందని.. అదే ఇప్పుడు కూలిపోయిందని జపాన్‌ మీడియా వెల్లడించింది. భూఉపరితలానికి సమీపంలో అణుప్రయోగాలు చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు ముందుగానే హెచ్చరించారు. అయినా కిమ్‌ లెక్కచేయలేదు. ఇలాంటి ప్రయోగాలు చేస్తే చైనా సరిహద్దు వద్ద ఉన్న పర్వతాలు కూలిపోయి రేడియేషన్‌ లీకయ్యే ప్రమాదం ఉందని ముందుగానే వూహించారు. అణు ప్రయోగం చేసినప్పుడు పరిసర ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం, ఆ తర్వాత 4.1 తీవ్రతతో ప్రకంపనలు రావడం తెలిసిందే.

ముఖ్యాంశాలు