అణ్వస్త్ర విమానాలతో అమెరికా యుద్ధ సన్నాహాలు


ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు, యుద్ధ దాహం పొరుగునే ఉన్న జపాన్, దక్షిణ కొరియా దేశాలకు పెను విపత్తుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో వాటిలో భరోసా కలిగించే సన్నాహాలను అమెరికా చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాలను ఉత్తర కొరియాకి గురిపెట్టేందుకు, వాటిలో అణ్వస్త్రాలు నింపి గట్టిగా బెదిరించేందుకు ట్రంప్ సిద్ధం అయ్యారు. అమెరికా తన అమ్ములపొదిలోని బి-2 స్టెల్త్‌ జెట్‌లను తాజాగా బయటికి తీసింది. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దక్షిణ కొరియా పర్యటన ఏర్పాట్లు యుద్ధసన్నాహాలను తలపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధవిమానంగా రికార్డు సృష్టించిన ‘బి-2 స్పిరిట్‌’ స్టెల్త్‌ విమానాలను అణ్వాయుధాలతో నింపేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోంది. వీటిల్లో అణ్వాయుధాలను లోడ్‌ చేసి ఆసియాలోని అజ్ఞాత ప్రదేశంలో మోహరిస్తారు. జపాన్,లేదా దక్షిణ కొరియాలోని ప్రదేశంలో వీటిని ఈ వారాంతంలో చేర్చవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేయగల సత్తా వీటి సొంతం. తన పర్యటనకి ముందే దక్షిణ కొరియా, జపాన్‌లలో నెలకొన్న భయాలను సంపూర్ణంగా తొలగించే స్థాయిలో ట్రంప్ భాయీ సన్నాహాలు చేస్తున్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం