ఆచూకీ లేని దీప మాధవన్

Chennai :

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ కొన్ని రోజులుగా జడ లేకపోవడం సంచలనం కలిగిస్తున్నది. ఆమె భర్త మాధవన్‌ తో విభేదాలు ఏర్పడటంతో దీప శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిపోయిందని సన్నిహితులు చెబుతున్నారు. గతవారం మాధవన్‌ తనను దీప డ్రైవర్‌ రాజా చంపుతానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా దీప స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఈ  ఫిర్యాదులో వాస్తవంలేదని వెల్లడించింది. ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అప్పటినుంచే దీప ఆచూకీ తెలియడంలేదట. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆమె ఏమైందో, ఆమె రాజకీయ వ్యూహం ఏమిటో తెలియక అనుచరులు కంగారుపడుతున్నారు. 

Facebook
Twitter