రాహుల్ సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ లో చేరిక


న్యూఢిల్లీ : తెలుగుదేశం వదిలిన తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌ ఆ పార్టీ లో చేరారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి రేవంత్‌ను రాహుల్‌ గాంధీ నివాసానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా తీసుకొచ్చారు. రేవంత్‌ను పార్టీలోకి రాహుల్‌ సాదరంగా ఆహ్వానించారు. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క, వేంనరేందర్‌రెడ్డి, విజయరమణారావు, అరికెల, బోడ జనార్దన్‌, మేడిపల్లి సత్యం తదితరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం