లారీ ఢీకొని వృద్ధుని మృతి

మండపేట రూరల్ : మండపేట మండలం ఇప్పనపాడు లింగరాజు పేట బొమ్మలగుడి మలుపు వద్ధ సైకిల్ పై వెళ్తున్న వృద్ధుడిని తాపేశ్వరం నుండి ద్వారపూడి వైపుకు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొంది. వృద్ధుడి శరీరంపైనుంచి చక్రాలు వెళ్లడంతో శరీర భాగాలు నుజ్జయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. కూత వేటు దూరంలో తన ఇళ్లు చేరుకుంటాడనుకునేసరికి మృత్యువు లారీ రూపంలో కబళించింది. వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని ఇప్పనపాడు లింగరాజుపేట బొమ్మలగుడి పక్క వీధిలో బెందా చినవెంకట్రాజు(63)మంగళవారం ఉదయం పనిపై తాపేశ్వరం సైకిల్ పై వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా ఇంకొన్ని క్షణాల్లో ఇంటికి చేరతాడన్న సమయంలో మండపేటనీండి ద్వారపూడిఅవెళ్తున్న లారీ వెనుక నుండ ఢీ కొంది. సైకిల్ రోడ్డు పక్కకు పడగా చిన వెంకట్రాజు లారీ చక్రాల కింద పడ్డాడు. శరీరంపైనుండి చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగించే ఇతనికి భార్య మహాలక్ష్మి,కుమారులు సత్తిబాబు, ఆనంద్ , అప్పారావులున్నారు. మృతుడి ఇళ్లుఅక్కడే కావడంతో స్థానికులు అంతా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా వివరాలు తెలిసిన వెంటనే రూరల్ సీఐ కోనాల లక్ష్మణరెడ్డి అక్కడికి చేరుకున్నారు. హెచ్ సి వై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం పోస్ట్ మార్టంకోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామ నాయకులు చింతలపూడి మల్లిబాబు, చిన్ని గంగాధరరావు తదితరులు ప్రమాద సంఘటన వద్ధకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం