వాట్ ఈజ్ దిస్ యోగి?


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని బస్సులను కాషాయం రంగులోకి మార్చారు. ఇపుడేమో సీఎం కార్యాలయానికి కూడా కాషాయ రంగు వేస్తున్నారు. లక్నో లోని శాస్త్రీ భవన్‌లో సీఎం అధికారిక కార్యాలయంతో పాటు పలు సీనియర్‌ అధికారుల ఆఫీసులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ భవనం తెలుపు, నీలం రంగుల్లో ఉంది. ఇప్పుడు కాషాయ రంగు వేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఎప్పుడూ కాషాయ రంగు దుస్తుల్లోనే ఉంటారు. ఆయన ఆఫీసులో వాడే టవల్స్‌, కర్టెన్లు అన్నీ ఇదే రంగులో ఉంటాయట. అంచేతనే ఇపుడు కార్యాలయాన్ని కూడా ఆ రంగులోకి మారుస్తున్నారన్న మాట.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం