ఎన్టీపీసీ బాయిలర్‌ పైపు పేలుడు ... 16 మంది మృతి


రాయ్‌బరేలి : ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి ఎన్టీపీసీ బాయిలర్‌ పైపు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. ఈ ప్రమాదంలోవంద మంది గాయపడినట్లు యూపీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.

ముఖ్యాంశాలు