జక్కంపూడి రాజాకు గుడా చైర్మన్ గన్ని పరామర్శ


పోలీసుల దాడికి గురై రాజమండ్రిలోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సిపి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను గుడా చైర్మన్ గన్ని కృష్ణ ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. సంఘటన వివరాలను అయన అడిగి తెలుసుకున్నారు. బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడి విషయంలో ఇలా ఎస్సై అమానుషంగా ప్రవర్తించడం హేయమని అయన అన్నారు. జక్కంపూడి రాజా పై రామచంద్రపురం లో ఎస్సై చేసిన దాడిని ఎపి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ యర్రా వేణుగోపాలరాయుడు తీవ్రంగా ఖండించారు. అయితే ఎస్సై దురుసు ప్రవర్తనను ప్రభుత్వానికి ఆపాదించడం తగదని ఆయన పేర్కొన్నారు.