బిజెపి హిమాచల్‌ సీఎం అభ్యర్థి ధుమాల్


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భాజపా తరపున సీఎం అభ్యర్థి గా మాజీ సీఎం ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌నే నిలబెడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాఆయి. ధుమాల్‌ సుజాన్‌పూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు సీఎం అభ్యర్థి రేసులో ప్రముఖంగా వినిపించింది. చివరికి ధుమాల్‌నే సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ధుమాల్ గతంలో రెండు సార్లు సీఎంగా పనిచేశారు. 1998 నుంచి 2003, 2008 నుంచి 2012 వరకు ధుమాల్‌ హిమాచల్‌ సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఇప్పటికే సీఎం అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రస్తుతం సీఎం వీరభద్ర సింగ్‌ రానున్న ఎన్నికల్లో కూడా సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల ప్రకటించారు. 68 నియోజకవర్గాలున్న హిమాచల్‌ అసెంబ్లీకి నవంబర్‌ 9న పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

ముఖ్యాంశాలు