వంట గ్యాస్‌ మళ్ళీ భగ్గుమంది


వంట గ్యాస్‌ ధర మళ్ళీ పెరిగింది. రాయితీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.93 పెంచడంతో దీని ధర రూ.742కు చేరింది. రాయితీ సిలిండర్‌ ధర రూ.4.50 పెరిగింది. గతంలో చివరిగా అక్టోబర్‌ 1న సిలిండర్‌పై రూ.50 పెంచారు. రాయితీపై అందించే సిలిండర్‌ ధర రూ.4.50 పెరిగింది. 2016 జులై తర్వాత ఇలా పెరగడం ఇది 19వ సారి. వినియోగదారులకు అందిస్తున్న రాయితీని క్రమంగా కుదించేందుకు ప్రతి నెలా సిలిండర్‌ ధరను కొంత మొత్తం పెంచాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పెంపు చోటుచేసుకుంది. తాజాగా పెరిగిన ధరతో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర దిల్లీలో రూ.495కి చేరింది. విమాన ఇంధన ధర కూడా 2 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరలను సవరించారు. ఆగస్టు తర్వాత ఏటీఎఫ్‌ ధర పెరగడం ఇది నాలుగోసారి.

ముఖ్యాంశాలు