శుభమస్తు కళ్యాణమండపం ప్రారంభం

రాజమహేంద్రవరం:

గుడా చైర్మన్ గన్ని కృష్ణ మోరంపూడి సెంటర్‌లో నిర్మించిన 'శుభమస్తు' కళ్యాణమండపంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అక్టోబర్ 31 న ప్రారంభించారు. మూడు ఫ్లోర్స్ గా నిర్మించిన ఫంక్షన్ హాలు ఆత్మీయులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాన ఫంక్షన్ హాల్ ను చినరాజప్ప, భోజనశాలను దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, మినీ ఫంక్షన్ హాల్ ను ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, ఏసి రూమ్స్ ను ఆకుల వీర్రాజు, రిసెప్షన్ రూమ్ ను పొలసానపల్లి హనుమంతరావు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణమహోత్సవాన్ని గన్ని కష్ణ, రాజేశ్వరి దంపతులు, అన్నే రామకృష్ణ, స్మిత దంపతులు జరిపించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, పెందుర్తి వెంకటేష్, మేయర్ పంతం రజినీ శేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే లు చందన రమేష్, రౌతు సూర్యప్రకాశరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, కంటిపూడి సర్వారాయుడు, మార్గాని నాగేశ్వరరావు, పంతం కొండలరావు, డాక్టర్‌ కర్రి రామారెడ్డి, బైర్రాజు ప్రసాదరాజు, పట్టపగలు వెంకట్రావు, టికె విశ్వేశ్వర రెడ్డి, నున్న తిరుమల రావు, రుంకాని వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి వాసు, ముప్పాళ్ళ సుబ్బారావు, నందెపు శ్రీనివాస్, అశోక్ కుమార్ జైన్, బుడ్డిగ శ్రీనివాస్, పులవర్తి లక్ష్మణ స్వామి, సత్యవరపు గోకుల సత్యన్నారాయణ, మేడపాటి షర్మిలారెడ్డి, బాక్స్ ప్రసాద్, కాశి నవీన్ కుమార్, దొండపాటి శేఖర్ బాబు, నిమ్మలపూడి గోవింద్ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు