3న కోటిలింగాల ఘాట్లో లక్షదీపోత్సవం


పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 5.30 గంటలకు కోటిలింగాల ఘాట్లో లక్షదీపోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే తరహాలోనే ఈసారి కూడా ఘనంగా కార్తీక లక్షదీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు. జిల్లా, నగర ప్రముఖులు, అధికారులు పాల్గొంటారు. భక్తులందరూ నిర్ణీత సమయానికి హాజరై ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. వివరాలకు 98663 14175 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

ముఖ్యాంశాలు