6న నన్నయ వర్సిటీకి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక


రాజమహేంద్రవరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీకీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈనెల 6 వ తేదీన రానున్నారు. యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ ను ఆయన ప్రారంభిస్తారు. అలాగే బొటానికల్ గార్డెన్ కు శంకుస్థాపన చేస్తారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి హోదాలో గోదావరి జిల్లాలకు రావడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశంలోని ఏ యూనివర్సిటీకీ వెళ్లలేదని తొలిసారి నన్నయ యూనివర్సిటీకే వస్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ముత్యాలు నాయుడు తెలిపారు.

ముఖ్యాంశాలు