EDITOR: Deekshitula Subrahmanyam

D.NO.23-19-50, Haripuram,

Rajahmundry, Andhra Pradesh 533105, India

@ Ira News Paper Copyright 2017

eMail: iranewspaper@gmail.com

Mobile no.94404 51836

  • iranewspaper
  • iranewspaper
  • Facebook Basic Square
  • Twitter Basic Square
  • Google+ Basic Square
 Follow Us
Ira News Paper

ఇక కిచిడి కి మహర్దశ

కిచిడి’ ఇకపై జాతీయ వంటకం హోదాను దక్కించుకోనుంది.

ప్రపంచ మార్కెట్లో వాణిజ్యపరంగా ఈ వంటకాన్ని ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతోనే ‘కిచిడి’కి జాతీయహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఢిల్లీలో జరగనున్న ‘వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌’ను ఇందుకు వేదికగా చేసుకోనుంది. రేపటి నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏకంగా 800 కేజీల ధాన్యాలతో ‘బ్రాండ్‌ ఇండియా కిచిడి’ని తయారుచేయనున్నారు. పాకశాస్త్ర ప్రవీణుడు, చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ పర్యవేక్షణలో ఈ వంటకాన్ని తయారుచేయనున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారి వంటకమైన ఈ కిచిడి సాంస్కృతిక వైవిధ్యమున్న భారత్‌కు ప్రతీక అని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే 60 దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిధులకు ఈ భారీ కిచిడిని వడ్డిస్తారని ఆమె తెలిపారు.

 

 

Facebook
Twitter