ఎస్ బి ఐ గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు


ఇల్లు, వాహన (కారు) కొనుగోలుదారులకు సంబంధిత రుణాలపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను తగ్గించింది. రిటైల్‌ రుణాలను పెంచడానికి, హోమ్‌, ఆటో రుణ రేట్లను 5 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త వడ్డీరేట్ల ప్రకారం 8.30 శాతానికి గృహ రుణాలను, 8.70 శాతానికి ఆటో రుణాలను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఇవి అర్హులైన వేతన కస్టమర్లందరికీ వర్తిస్తాయని, రూ.30 లక్షల వరకున్న రుణాలకు వార్షికంగా 8.30 శాతం వడ్డీరేటును విధించనున్నట్టు బ్యాంకు తెలిపింది. కారు రుణాల వడ్డీరేట్లు వార్షికంగా 8.70 శాతం నుంచి 9.20 శాతం మధ్యలో ఉండన్నాయి. అసలైన రేటు రుణ మొత్తం, వ్యక్తి క్రెడిట్‌ స్కోర్‌పై ఆధారపడి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. మెచ్యూరిటీస్‌లకు వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్టు కూడా ఎస్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతమున్న ఏడాది ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేటును కూడా బ్యాంకు తగ్గించింది. అంతకముందు 6.5 శాతమున్న వడ్డీరేటును ప్రస్తుతం 6.25 శాతానికి కుదించింది.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం