డోక్లామ్ గురించి ముందే చెప్పిన సర్దార్ పటేల్


గోవా : భారత్‌-చైనా మధ్య డోక్లామ్‌ వివాదం వస్తుందని భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆనాడే ఊహించారా? మాజీ రక్షణ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అవుననే అంటున్నారు. పటేల్‌ జయంతి సందర్భంగా పనాజీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పారికర్‌ ప్రసంగించారు. తాను రక్షణమంత్రిగా పనిచేసిన సమయంలో పటేల్‌ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని.. అప్పుడే ఆయన జీవితం నుంచి చాలా విషయాలునేర్చుకున్నానని పారికర్‌ అన్నారు. అప్పట్లో పటేల్ నాటి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూకు రాసిన ఓ ఉత్తరాన్ని తానూ చదివానని అందులో డోక్లామ్‌ వివాదం గురించి ప్రస్తావన ఉన్నాడని పారికర్ అన్నారు. "డోక్లామ్‌ వివాదం తలెత్తే అవకాశం ఉందని పటేల్‌ అప్పుడే అంచనా వేశారు. ఇటీవల అది చోటుచేసుకుంది" అని పారికర్‌ అన్నారు. 1965లో జరిగిన భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధాన్ని కూడా పటేల్‌ ముందుగానే వూహించి 1950లోనే హెచ్చరించారని వెల్లడించారు.

ముఖ్యాంశాలు