దేశం సర్వ నాశనం అయిపోయింది - ఏచూరి


హైదరాబాద్ : నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో అన్ని రంగాలునాశనం అయిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాపోయారు. దేశ ఆర్థిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందన్నారు. బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కళ్యాణమంటపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టారని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఉపాధి పోయిందని మండిపడ్డారు. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, రైల్వేను ప్రైవేటీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు ఇటువంటి తిరోగమన విధానాలపై పోరుకు దశ, దిశ చూపించాలన్నారు. నోట్లరద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయ్యిందని, వెయ్యి నోటుతో జరిగే అవినీతి ఇప్పుడు రెండువేల నోటుతో జరుగుతోందన్నారు. సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి. మధు పాల్గొన్నారు

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం