పరిపూర్ణానంద నేతృత్వంలో రాష్ట్రీయ హిందూ సేన


Narayanakhed : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బుధవారం రాత్రి రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభను నిర్వహించారు.

కులాల్ని కించపరుస్తూ ఎవరు పుస్తకాలు రాసినా సహించేది లేదని కాకినాడ శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలిపారు. త్వరలో అన్ని కులాలతో సర్వజన సంఘటన ఏర్పాటు చేస్తానన్నారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ మహిషాసురుడి సంహారం కోసం అమ్మ వారు ఉద్భవించిన తరహాలో కొందరు పాపాత్ముల కోసం తాను బయటకు వస్తానని చెప్పారు. ఇందుకోసం తనను ఆ అమ్మవారే పంపారన్నారు. తన పుట్టుక, కులం, మతం వగైరాల గురించి గురించి ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యానాలపై స్వామిజి పరోక్షంగా మండిపడ్డారు. ఎక్కడ ఏ మాతృమూర్తి తనను అక్కున చేర్చుకుంటే వారే నా తల్లి అని, ఏ గడపకు వెళ్తే అదే నా ఇల్లు అని, ఏ పురుషుడి రూపం ఎదురైనా నాకు తండ్రి లాంటి వారే అని స్వామిజి చెప్పారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ.. మీ అమ్మ గురించి చెప్పేందుకు ఇబ్బంది ఏమిటని వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ తన రూట్స్‌ గూర్చి బ్రూట్స్‌కు, చెప్పాల్సిన అవసరం లేదని స్వామిజి అన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం