పాదయాత్రకు భద్రత కోసం జగన్ వినతి


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పాదయాత్రలో జెడ్ జెటగిరీ కి అనుగుణమైన భద్రత కల్పించాలంటూ ఆయన పర్సనల్‌ సెక్రటరీ గురువారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. సుమారు ఏడు నెలల పాటు జగన్‌ పాదయాత్ర షెడ్యూల్ సిద్ధమైంది. వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ 13 జిల్లాల్లో సుమారు 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని తెలిపారు. త్వరలోనే రూట్‌మ్యాప్‌ను జిల్లాలవారీగా పోలీసుశాఖకు అందచేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు.