భూటాన్ యువరాజుకు మోదీ కానుక!


న్యూ ఢిల్లీ : భారత పర్యటనకు వచ్చిన భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ దంపతులు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. వారితో ప్రధాని మోదీ కాసేపు ముచ్చటించారు. వారి చిన్నారి కుమారుడు (భూటాన్ యువరాజు)కు ఫిఫా అండర్‌-17 వరల్డ్‌కప్‌లో ఉపయోగించిన అధికారిక ఫుట్‌బాల్‌, ఒక చెస్‌ సెట్‌ను ప్రధాని కానుకలుగా ఇచ్చారు. ఈ ఫొటోలను మోదీ తన ట్విటర్‌ లో పోస్ట్ చేసారు. భూటాన్‌ రాజకుటుంబాన్ని కలవడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు