రొమ్ము క్యాన్సర్ పై మహిళా పోలీసులకు అవగాహన


రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు స్థానిక జేఎన్‌ రోడ్డులోని చెరుకూరి కల్యాణ మండపంలో మంగళవారం జరిగింది. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ క్యాన్సర్‌ అంటే ప్రాణాంతక వ్యాధి అన్న అపోహ చాలామందిలో ఉందన్నారు. అయితే వైద్య సేవల పరంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, క్యాన్సర్‌కు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మహిళా పోలీసు సిబ్బంది ఈ వ్యాధిపై సదవగాహన కల్పించుకొని ఈ వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షించారు. జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి వైద్యుడు ప్రహ్లాద, అనూష తదితరులు క్యాన్సర్‌ లక్షణాల గుర్తింపును వివరించారు. అర్బన్‌ జిల్లా అదనపు ఎస్పీ ఆర్‌.గంగాధర్‌రావు, మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ, డీటీసీ డీఎస్పీ ఆర్‌.సత్యానందం, ఎస్‌బీ డీఎస్పీలు పి.సత్యనారాయణరావు, బి.రామకృష్ణ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు
తాజా వార్తలు
​సంబంధిత సమాచారం