రూ.12 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం
రంపచోడవరం : జడ్డంగి గ్రామ శివారులో మంగళవారం పోలీసులు రూ. 12 లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటత్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ నుంచి రాజమహేంద్రవరం వైపు వాహనంలో తవుడు బస్తాలతో పాటు తరలిస్తున్న 429 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండ ప్రాంతానికి చెందిన ధీనబందు ఖిలా, శుభారావు ఖరాను అరెస్ట్‌చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై నాగార్జున, పశువైద్యాధికారి చైతన్య, వీఆర్వో విజయకుమారి, పోలీసు సిబ్బంది ఉన్నారు.