బ్యాంకు ల ఉద్యోగ నియామకాల్లో పెను మార్పులు


దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య 1,082 మందిని తగ్గించినట్టు తెలిసింది. 2017 జూన్‌ నాటికి ఈ బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 84,140 కాగా ఈ తగ్గింపు తర్వాత సెప్టెంబర్‌ 30 నాటికి 83,058 మంది మిగిలారు. ఇప్పటి వరకు భారీగా రిక్రూట్ మెంట్లు జరిగే రంగంలో దేశీయ బ్యాంకింగ్‌ కూడా ఉండేది. కానీ రోబోట్స్‌, చాట్‌బోట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, ఇతర టెక్నాలజీలు రావడంతో బ్యాంకు ఉద్యోగాలకు ముప్పు పెరిగింది. దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా పేరున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2,700 మంది ఉద్యోగులను చేర్చుకుంది. యాక్సిస్‌ బ్యాంకు కూడా 2,270 మందిని కొత్తగా నియమించుకుంది. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉన్న రెండో క్వార్టర్‌లో తొలి క్వార్టర్‌లో బ్యాంకు 1300 మంది ఉద్యోగులను నియమించుకోగా.. రెండో క్వార్టర్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే మాత్రం బ్యాంకు తన ఉద్యోగులను పెంచుకున్నట్టు తెలిసింది. గతేడాది బ్యాంకు ఉద్యోగులు 80,475 మంది ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 83,058 మంది ఉన్నారు.

ముఖ్యాంశాలు